Num 2:1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.
Num 2:2 ఇశ్రాయేలీయులందరు తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.
Num 2:3 సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమీ్మనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.
Num 2:4 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.
Num 2:5 అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.
Num 2:6 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.
Num 2:7 అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.
Num 2:8 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.
Num 2:9 యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారు వేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.
Num 2:10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.
Num 2:11 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.
Num 2:12 అతని సమీపమున షిమ్యోను గోత్రి కులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీ యేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.
Num 2:13 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
Num 2:14 అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
Num 2:15 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
Num 2:16 రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
Num 2:17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
Num 2:18 ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
Num 2:19 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.
Num 2:20 అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.
Num 2:21 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది.
Num 2:22 అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.
Num 2:23 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.
Num 2:24 ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
Num 2:25 దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.
Num 2:26 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండు వేల ఏడువందలమంది.
Num 2:27 అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
Num 2:28 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
Num 2:29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమా రులకు ప్రధానుడు.
Num 2:30 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
Num 2:31 దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
Num 2:32 వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబ ముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.
Num 2:33 అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.
Num 2:34 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్త మును చేసిరి. అట్లు వారు తమ తమ వంశములచొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచు నుండిరి.

No comments:
Post a Comment