Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, October 9, 2013

సంఖ్యాకాండము 31

Num 31:1  మరియు యెహోవామిద్యానీయులు ఇశ్రాయేలీ యులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.
Num 31:2  తరు వాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా
Num 31:3  మోషే ప్రజలతోమీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికిపోయి మిద్యానీయు లకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు
Num 31:4  ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలె ననెను.
Num 31:5  అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలో నుండి పండ్రెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా
Num 31:6  మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధ మునకు పంపెను.
Num 31:7  యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.
Num 31:8  చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకె మును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.
Num 31:9  అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్ల లను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱ మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.
Num 31:10  మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలటిని అగ్నిచేత కాల్చివేసిరి.
Num 31:11  వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.
Num 31:12  తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా
Num 31:13  మోషేయు యాజకుడైన ఎలి యాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొను టకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.
Num 31:14  అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.
Num 31:15  మోషే వారితోమీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?
Num 31:16  ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయ ములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.
Num 31:17  కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయో గము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;
Num 31:18  పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.
Num 31:19  మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపట్టినవారును మూడవ దినమున ఏడవ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను.
Num 31:20  మీరు బట్టలన్నిటిని చర్మవస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్య వస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.
Num 31:21  అప్పుడు యాజకుడగు ఎలి యాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధియేదనగా
Num 31:22  మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును
Num 31:23  అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయ వలెను.
Num 31:24  ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
Num 31:25  మరియు యెహోవా మోషేకు ఈలాగుసెలవిచ్చెను.
Num 31:26  నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి
Num 31:27  యుద్ధ మునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.
Num 31:28  మరియు సేనగా బయలు దేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకల లోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగ ములోనుండి తీసికొని
Num 31:29  యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.
Num 31:30  మనుష్యుల లోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.
Num 31:31  యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజ కుడైన ఎలియాజరును చేసిరి.
Num 31:32  ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది
Num 31:33  ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱమేకలును,
Num 31:34  డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,
Num 31:35  ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,
Num 31:36  అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱమేకల లెక్కయెంతనగా మూడు లక్షల ముప్పది యేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱమేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.
Num 31:37  వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు.
Num 31:38  ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు,
Num 31:39  వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.
Num 31:40  మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు.
Num 31:41  యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.
Num 31:42  సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చెను.
Num 31:43  మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱమేకలును
Num 31:44  ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును
Num 31:45  పదునారువేల మంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమై యుండగా, మోషే
Num 31:46  ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను
Num 31:47  ఏబ దింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.
Num 31:48  అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి
Num 31:49  నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.
Num 31:50  కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరము లను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా
Num 31:51  మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.
Num 31:52  సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడు వందల ఏబది తులములు.
Num 31:53  ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను.
Num 31:54  అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతులయొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.

No comments:

Post a Comment