Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, October 9, 2013

సంఖ్యాకాండము 33

Num 33:1  మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
Num 33:2  మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.
Num 33:3  మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.
Num 33:4  అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.
Num 33:5  ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.
Num 33:6  సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.
Num 33:7  ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.
Num 33:8  పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.
Num 33:9  ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.
Num 33:10  ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
Num 33:11  ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
Num 33:12  సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
Num 33:13  దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
Num 33:14  ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
Num 33:15  రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
Num 33:16  సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
Num 33:17  కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
Num 33:18  హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
Num 33:19  రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
Num 33:20  రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
Num 33:21  లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.
Num 33:22  రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.
Num 33:23  కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.
Num 33:24  షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
Num 33:25  హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
Num 33:26  మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
Num 33:27  తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
Num 33:28  తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
Num 33:29  మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
Num 33:30  హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
Num 33:31  మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
Num 33:32  బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.
Num 33:33  హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
Num 33:34  యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.
Num 33:35  ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
Num 33:36  ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
Num 33:37  కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
Num 33:38  యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
Num 33:39  అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
Num 33:40  అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.
Num 33:41  వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
Num 33:42  సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
Num 33:43  పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
Num 33:44  ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
Num 33:45  ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.
Num 33:46  దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
Num 33:47  అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.
Num 33:48  అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
Num 33:49  వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
Num 33:50  యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
Num 33:51  నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత
Num 33:52  ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి
Num 33:53  ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.
Num 33:54  మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.
Num 33:55  అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.
Num 33:56  మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

No comments:

Post a Comment