Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, October 10, 2013

సంఖ్యాకాండము 8

Num 8:1  యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతో
Num 8:2  నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.
Num 8:3  యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.
Num 8:4  ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలు కొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్ష మును చేయించెను.
Num 8:5  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలోనుండి
Num 8:6  లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.
Num 8:7  వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని
Num 8:8  తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచు కొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.
Num 8:9  అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయ వలెను.
Num 8:10  నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడు కొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.
Num 8:11  లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింప వలెను.
Num 8:12  లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతు లుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చి త్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి
Num 8:13  అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.
Num 8:14  అట్లు నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు.
Num 8:15  తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతి ష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్య క్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.
Num 8:16  ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయ బడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయు లలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.
Num 8:17  ఏలయనగా మనుష్యులలోను పశు వులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించు కొంటిని.
Num 8:18  ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.
Num 8:19  మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయు లలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.
Num 8:20  అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీ యుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీ యులు వారికి అట్లేచేసిరి.
Num 8:21  లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరు వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
Num 8:22  తరువాత లేవీ యులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.
Num 8:23  మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనుఇది లేవీయులనుగూర్చిన విధి.
Num 8:24  ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను.
Num 8:25  అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.
Num 8:26  వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితో కూడ పరిచర్య చేయ వలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.

No comments:

Post a Comment